నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

Published on May 28, 2020 11:30 am IST

తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నేడు సినీకార్మికులకు అందించనున్న కిట్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారేడ్ పల్లి లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హల్ నుండి నిత్యావసర వస్తువులు ఉన్న వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మరియు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్ ను చిరంజీవి,నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ సినీ కార్మికులకు అందజేయనున్నారని సమాచారం.

ఇక చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా అనేక సేవా కార్యకమాలు చేసిన చిత్ర ప్రముఖులు ప్రభుత్వ సహాయంతో మరో మారు సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఈ మధ్యనే ప్రభుత్వంతో చర్చలు జరిపిన సినీ ప్రముఖులు షూటింగ్స్ పునఃప్రారంభంపై స్పష్టత తీసుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More