
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న మా టీవీ వారు ప్రతి ఏడాది టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ వర్క్ నీ గుర్తించి వారికి ‘సినీ మా అవార్డ్స్’ ఇచ్చి సత్కరిస్తారు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా సినీ మా అవార్డ్స్ ని చాలా గ్రాండ్ గా చేసారు. నిన్న సాయంత్రం సినీ మా అవార్డ్స్ వేడుకలను హైదరాబాద్ లోని నవోటల్లో చేసారు. ఈ వేడుకకి టాలీవుడ్ స్టార్స్ అందరూ రావడమే కాకుండా ప్రతి ఒక్కరూ స్పెషల్ పెర్ఫార్మన్స్ కూడా చేసి ఆకట్టుకున్నారు. సినిమా అవార్డ్స్ వేదికలో సూపర్ స్టార్ కృష్ణకి లైఫ్ టైం అచీవ్ మెంట్ ని ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి 1-నేనొక్కడినే సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ జ్యూరీ అవార్డు వస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి రేసు గుర్రం సినిమాకి గాను బెస్ట్ హీరోగా అవార్డు వచ్చింది. మనం సినిమాకి సమంత బెస్ట్ హీరోయిన్ అయితే బెస్ట్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను, బెస్ట్ విలన్ గా జగపతి బాబు అవార్డ్స్ అందుకున్నారు. మిగతా డిపార్ట్ మెంట్స్ కి సంబందించిన అవార్డు ని కూడా అందజేశారు. ఇవి కాకుండా సుమ – అలీ ప్రతి ఏడాది చేసే ఓఒక స్పూఫ్ కామెడీ బిట్ ఈ సారి మేజర్ హైలైట్ అయ్యింది. వీటితో పాటు స్టార్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, రెజీన కసాండ్ర, అంజలీ, లక్ష్మీ రాయ్, రాశి ఖన్నా, సాయి ధరం తేజ్, దేవీశ్రీ ప్రసాద్, ఆద శర్మ, అనసూయ తదితరుల పెర్ఫార్మన్స్ అక్కడి శ్రోతలను అమితంగా ఆకట్టుకుంది.

