‘ఇండియన్-2’ విషయంలో క్లారిటీ వచ్చేసింది

kamal1

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్-2’. ఇందులో విలన్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తారని చెప్పుకొచ్చారు చిత్ర బృందం. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. పైగా అనిల్ కపూర్ చెన్నై వెళ్లినప్పుడు శంకర్ ను కలవడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఈ వార్టలకు మరింత బలం చేకూరింది. కానీ తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

అనిల్ కపూర్ ఏదో ప్రమోషనల్ ఈవెంట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు శంకర్ ను మామూలుగానే కలిశారట, అంతేకానీ సినిమా కోసం కాదట. అంటే గతంలో కమల్ చెప్పినట్టు ఇందులో ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తారన్నమాట. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version