శంకర్, ప్రభాస్ సినిమా.. నిజం ఏమిటంటే..

Published on May 30, 2019 4:03 pm IST

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేయనున్నాడు… ఈ వార్త గత రెండు మూడు రోజులుగా చక్కర్లు కొడుతూ అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభిమానులు ఈ వార్త నిజమైతే బాగుండని కోరుకున్నారు. కానీ ఈ వార్త వాస్తవం కాదని శంకర్ సన్నిహిత వర్గాలు, తమిళ మీడియా క్లారిటీ ఇచ్చారు.

శంకర్ తన ‘ఇండియన్-2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని, కొత్త ప్రాజెక్ట్ ఆలోచనలేవీ ఆయనలో లేవని అంటున్నారు. ఇక ‘సాహో’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ అటు రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడురు. ఇంతకుముందెప్పుడూ ఒకేసారి రెండు సినిమాలు చేయని ప్రభాస్ ఈ సినిమాలు పూర్తయ్యాక కొంత బ్రేక్ తీసుకొని తర్వాతి చిత్రం గురించి ఆలోచిస్తారట.

సంబంధిత సమాచారం :

More