ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపైనా గత రెండు రోజులు నుంచి కూడా పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సానియా మాజీ భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కి చెందిన ఓ నటిని పెళ్లి చేసుకోవడంతో సానియా వార్తల్లోకెక్కింది. అయితే సానియా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందా లేదా లేకపోతే ఆమెకి తెలియకుండానే ఇవన్నీ జరిగాయా అనే అంశాల్లో ఆమె పేరు మరింత వైరల్ గా మారగా ఈ అంశంపై సానియా మీర్జా కుటుంబం నుంచి అలాగే తన టీం నుంచి క్లారిటీ రావడం జరిగింది.
అయితే వారు సానియా మీర్జా తన పర్శనల్ లైఫ్ ని చాలా తక్కువ మాత్రమే పబ్లిక్ కి చూపించేందుకు ఇష్టపడేవారు అని ప్రస్తుతానికి షోయబ్ తో తాను విడాకులు తీసుకున్నారు అనేది వాస్తవం అని కన్ఫర్మ్ చేశారు. అలాగే సానియా షోయబ్ కొత్త జీవితానికి తన వెల్ విషెస్ తెలిపారు అని అయితే ఇది ఆమె జీవితంలో కాస్త సున్నితమైన సమయం కాబట్టి ఏవరు కూడా ఆమెని ఇబ్బంది పెట్టవద్దని తాము కోరుకుంటున్నట్టుగా సానియా తరపున ఆమె కుటుంబం మరియు ఆమె టీం వెల్లడి చేసింది. దీనితో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.


