“ఆపరేషన్ వాలెంటైన్” స్పెషల్ ప్రీమియర్ షో పై క్లారిటీ!

“ఆపరేషన్ వాలెంటైన్” స్పెషల్ ప్రీమియర్ షో పై క్లారిటీ!

Published on Feb 28, 2024 8:05 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం హిందీ లో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ కోసం ముంబైలో రేపు రాత్రి జరగనున్న ప్రత్యేక ప్రీమియర్ షో గురించి ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది.

ఈ స్పెషల్ ప్రీమియర్ షో కి ప్రముఖ సెలబ్రిటీలు మరియు సినీ జర్నలిస్టులు హాజరు కానున్నారు. ఈ చిత్రంలో నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు