యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ ఇప్పుడు ఎంత సాలిడ్ గా ఉందో అందరికీ తెలిసిందే. మరి వాటిలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే రెండు ఉన్నాయి. వాటిలో నాగ్ అశ్విన్ తో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా ఒకటి. మరి ఈ చిత్రం విషయంలో మేకర్స్ మాత్రం ఎక్కడా ప్రభాస్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చెయ్యకుండా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం అప్డేట్స్ విషయంలో దర్శకుడు మరో క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం నుంచి ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని “రాధే శ్యామ్” రిలీజ్ అయ్యాకనే “ఆదిపురుష్” మొదలైన తర్వాత నుంచి ఏ అప్డేట్ అయినా ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా వ్యక్తం చేసాడు. అలాగే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ థ్రిల్లర్ గా ఉంటుందని తెలిపాడు. సో ఈ భారీ చిత్రం నుంచి అప్డేట్స్ కావాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
