స్టైలిష్ యాక్షన్ ఈజ్ బ్యాక్.. 4K క్వాలిటీతో మళ్ళీ వస్తున్న ‘మున్నా’!

Munna

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ‘మున్నా’ చిత్రం ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 6న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం, అప్పట్లో ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. హారిస్ జయరాజ్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ చార్ట్‌బస్టర్‌గానే ఉంది. సరిగ్గా మరో 7 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుండటంతో, భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు డైలాగ్స్ అందించగా, సినిమాటోగ్రఫీ సి.రామ్ ప్రసాద్ బాధ్యతలు నిర్వహించారు. మరి ఈ సినిమా మళ్లీ వెండితెరపై 4K క్వాలిటీతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version