ఎన్టీఆర్ బయోపిక్ వార్తలో నిజం లేదు !

ఎన్టీఆర్ బయోపిక్ వార్తలో నిజం లేదు !

Published on Apr 3, 2018 10:00 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంభందించి రోజుకో వార్త బయటికి వస్తోంది. తాజాగా ఈ సినిమాలో నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిచబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలో వాస్తవం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది అనే వార్తలో కూడ నిజం లేదట.

తేజ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను విష్ణు ఇందురి , సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

తాజా వార్తలు