రాజమౌళి మల్టీ స్టారర్లో రాజశేఖర్ పాత్రపై క్లారిటీ వచ్చింది !

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో చేయనున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ యొక్క స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ను ప్రతినాయకుడిగా రాజమౌళి తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించారు రాజశేఖర్ సతీమణి జీవిత.

తమ కుమార్తె శివాని యొక్క మొదటి సినిమా ప్రారంభోత్సవానికి రాజమౌళిగారిని ఆహ్వానించడంతో ఈ రూమర్స్ వచ్చి ఉంటాయని, మల్టీ స్టారర్ సినిమా గురించైతే రాజమౌళిగారు తమను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారామె. ఇకపోతే దానయ్య నిర్మించనున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం సెప్టెంబర్ నుండి మొదలుకానుంది.