వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తుంటారు కూడా. అయితే ఆయన ప్రకటించిన సినిమాలలో అన్ని సెట్స్ మీదకు వెళ్ళవు. మరికొన్ని ప్రకటించిన దగ్గరే ఆగిపోతాయి. అయితే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, జరిగిపోయిన వాటిని బేస్ చేసుకుని వర్మ సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి సినిమా ప్రకటనలలో నయీం, శశికళ బయోపిక్ లు కూడా తీయబోతున్నట్టు ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ గతంలో తాను ప్రకటించిన సినిమాలు వస్తే వస్తాయని, లేదంటే రావని తేల్చి చెప్పారు. అనౌన్స్ చేసి సినిమా చేయకపోవడం అంటే మాట మీద నిలబడకపోవడం కాదన్నారు. అలా అనౌన్స్ చేసిన వాటిలో నయీం, శశికళ నాకు గుర్తులేవని, అలాంటివి మరో పది సినిమాలి ఉండొచ్చని అన్నారు. ఒక ఐడియాను ఒకరిద్దరితో డిస్కస్ చేసినప్పుడు కొన్ని సినిమా పేర్లు భయటకొస్తాయని అన్నారు. అయితే తక్కువ కాలంలో నేను తీసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదని, తాను ప్రకటించిన సినిమాలన్నీ టైమ్ వచ్చినప్పుడు విడుదల అవుతాయని అన్నారు. తాను ప్రొడ్యూసర్లు దొరక్క సినిమాలు చేయడం లేదనేది వాస్తవం కాదని ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లు చేస్తున్నామని వర్మ క్లారిటీ ఇచ్చారు.


