“జై హనుమాన్” లో యష్ ప్రెజెన్స్ పై క్లారిటీ.!

“జై హనుమాన్” లో యష్ ప్రెజెన్స్ పై క్లారిటీ.!

Published on Feb 15, 2024 1:04 AM IST

రీసెంట్ గా సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ కాంబినేషన్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం “హను మాన్”. మరి ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి సీక్వెల్ ని కూడా లాక్ చేసుకుంది. ఇక ఈ చిత్రానికి “జై హనుమాన్” గా నామకరణం చేయగా ఈ చిత్రంపై అయితే కొన్ని క్రేజీ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

అలా ఈ సినిమాలో హనుమాన్ గా కన్నడ స్టార్ నటుడు యష్ నటిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక నిన్న కూడా ఇది నిజమే అన్నట్టుగా మరిన్ని వార్తలు బాలీవుడ్ వర్గాలు కూడా చెప్పాయి. కానీ ఈ అంశంపై ఇప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఈ సినిమాలో యష్ ఉంటాడు అని కానీ హనుమాన్ గా చేస్తున్నాడు అని కానీ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదట. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తుంది. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు