మహేష్ ఫ్యాన్స్ – విజయవాడు పోలీసుల మధ్య రభస.!

మహేష్ ఫ్యాన్స్ – విజయవాడు పోలీసుల మధ్య రభస.!

Published on Sep 14, 2014 7:00 PM IST

aagadu-katout

ఈ రోజు విజయవాడ సిటీ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మధ్య పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు అభిమానులు ఎంతో కష్టపడి నిర్మించిన ఆగడు కటౌట్ ని కూల్చేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

అసలు విషయంలోకి వెళితే ‘ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగడు రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు. మూడు రోజుల క్రితం నుంచే దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయి. ఈ కటౌట్ ని పెట్టడం దాదాపు చివరి దశకు వచ్చే సమయంలో పోలీసులు రంగంలోకి దిగి ఆ కటౌట్ పెట్టడానికి పర్మిషన్ లేదని దానిని నిలిపి వేసి కటౌట్ ని తీసేయిస్తున్నారు. దాంతో మహేష్ అభిమానులకి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో నిరాశ చెందిన ఓ మహేష్ అభిమాని నెలలలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వారు దూకి అతన్ని కాపాడారు. దీంతో ఈ విషయం మరింత సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అభిమానులకి పోలీసులకి మధ్య చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు