‘స్పిరిట్’లో క్లాష్ ఆఫ్ ఈగోస్.. యాక్షన్ కంటే సైలెన్స్ ఎక్కువ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘స్పిరిట్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి కాప్ యాక్షన్ డ్రామాగా సందీప్ రూపొందిస్తు్న్నాడు. ఒక రూత్‌లెస్ పోలీస్ అవతారంలో ప్రభాస్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారట. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ ప్రస్తుతం తెరకెక్కుతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. అయితే, ఈ సీక్వెన్స్‌లో యాక్షన్ కంటే కూడా సైలెన్స్‌తోనే సందీప్ పనికానిస్తున్నాడట. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్‌లో సీరియస్ డ్రామాను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు ప్రభాస్‌తో జరిగే వార్ డ్రామాలో యాక్షన్ కంటే కూడా ఇద్దరు సైలెన్స్ వార్ చేసే ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్, పవర్‌ఫుల్ వ్యక్తిగా వివేక్.. ఇద్దరి మధ్య జరిగే ఈగో క్లాష్ వెండితెరపై అద్భుతంగా రూపొందించనున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

Exit mobile version