‘లైగర్’కి క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్ అట !

‘లైగర్’కి క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్ అట !

Published on Mar 30, 2021 3:00 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న “లైగర్” సినిమా ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. అయితే, సినీ వర్గాల సమాచారం ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తరువాత ఇక కేవలం ఈ సినిమాలో ఒక్క క్లైమాక్స్ మాత్రమే షూట్ కి బ్యాలెన్స్ ఉంటుందట. ఇక ఈ సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు