రూమర్స్ నమ్మొద్దు, ఆయన పార్టీ పెట్టడం ఖాయం.

రూమర్స్ నమ్మొద్దు, ఆయన పార్టీ పెట్టడం ఖాయం.

Published on Sep 7, 2019 12:33 PM IST

రజని కాంత్ ప్రస్తుతం దర్బార్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజని చాలా కాలం తరువాత పోలీస్ పాత్రలో చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రజినీకి జోడిగా నయనతార నటిస్తుంది. ఐతే రజిని రాజకీయ అడుగులు, నిర్ణయాల గురించి ప్రస్తుతం అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.

ముఖ్యంగా రజిని బీజేపీలో చేరనున్నారనే ఒక వార్త కొద్దిరోజులుగా ప్రముఖంగా వినిపిస్తుంది. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలంటే రజిని లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని, భావిస్తున్నారని అంటున్నారు. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రజిని బీజీపీ తో జత కట్టడానికి సుముఖంగా లేరట. ఆయన ముందుగా చెప్పిన విధంగానే సొంత పార్టీ పెట్టి ప్రజలలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని వినికిడి. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా రజిని తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు