మహేష్ 25లో ఆ ఎపిసోడ్ హైలైట్ కానుందట !

Mahesh Babu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల డెహ్రాడూన్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఇక ఈ షెడ్యూల్ లో తెరకెక్కించిన కళాశాల ఎపిసోడ్ చిత్రానికే హైలైట్ గా నిలవనుందట. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మహేష్ బర్త్ డే సందర్బంగా ఆగష్టు 9న విడుదలకానుందని సమాచారం.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్, పివిపిలు కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Exit mobile version