‘ఎఫ్ 3’లో కామెడీ కింగ్ కన్ ఫ్యూజన్ !

‘ఎఫ్ 3’లో కామెడీ కింగ్ కన్ ఫ్యూజన్ !

Published on Jan 26, 2021 12:00 AM IST

కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ కి చాల కాలం తరువాత మంచి క్యారెక్టర్ దొరికిందట. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ… ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘ఎఫ్ 3’. వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి చేస్తోన్న ఈ సినిమాలో ఓ కామెడీ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో డా రాజేంద్రప్రసాద్ నటించబోతున్నాడు.

అనిల్ రావిపూడి సినిమా అనగానే మొదటి నుండి రాజేంద్రప్రసాద్ కి మంచి రోల్ ఉంటూనే ఉంది. కాగా రీసెంట్ గా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు