‘ఆగడు’లో తమన్నా తండ్రిగా కామెడీ విలన్.

Published on Jul 14, 2014 1:12 pm IST

tamanna_tanalika-bharani
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన తొలిసారిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం ‘ఆగడు’. ఈ చిత్రంలో తమన్నా తండ్రిగా కామెడీ విలన్ పాత్రలో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి నటించారు. ఇటివల కాలంలో నాకు బాగా సంతృప్తినిచ్చిన పాత్ర ‘ఆగడు’ చిత్రంలో పాత్ర అని భరణి తెలిపారు.

యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత యువ సంగీత సంచలనం తమన్ మరోసారి మహేష్ బాబు చిత్రానికి స్వరాలను అందిస్తున్నారు. మహేశ్ బాబు పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 9న ‘ఆగడు’ ఆడియో విడుదల చేయనున్నారని సమాచారం. సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల అవుతుంది.

ప్రస్తుతం ‘ఆగడు’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 18 నుండి ప్రారంభమయ్యే షెడ్యూల్లో మహేశ్, శ్రుతీహాసన్‌పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఈ నెలాఖరు నుండి షూటింగ్ నార్వేకి షిఫ్ట్ అవుతుంది. మహేశ్, తమన్నాలపై 2 పాటలను తెరకేక్కిస్తారు.

సంబంధిత సమాచారం :