కన్ఫర్మ్ : త్వరలో 90’s సెకండ్ సీజన్

కన్ఫర్మ్ : త్వరలో 90’s సెకండ్ సీజన్

Published on Jan 16, 2024 11:31 PM IST

శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ వెబ్ సిరీస్ 90’s. ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఈటివి విన్ లో ఇటీవల ప్రసారం అయిన ఈ సిరీస్ కు అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ మినిట్ వ్యూస్ ని దాటేసిన విషయం తెలిసిందే. ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సిరీస్ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఈ సిరీస్ నిర్మాత నవీన్ మేడారం మాట్లాడుతూ, సెకండ్ సీజన్ తప్పకుండా ఉంటుందని, ఇప్పటికే దాని తాలూకు స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని అన్నారు. కాగా ఫస్ట్ సీజన్ లోని క్యారెక్టర్స్ ని సెకండ్ సీజన్ లో క్యారీ ఫార్వార్డ్ చేయనున్నట్లు తెలిపారు. అలానే ఫస్ట్ సీజన్ ని మించి మరింతగా ఆడియన్స్ ని అలరించేలా సెకండ్ సీజన్ రూపొందించే ప్లాన్ లో ఉన్నామని అన్నారు నవీన్. మొత్తంగా ఈ సిరీస్ తో ఈటివి విన్ వారికి బాగా క్రేజ్ లభించింది అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు