“హను మాన్” ఓటిటి రిలీజ్ డేట్ పై ట్విస్ట్.!

“హను మాన్” ఓటిటి రిలీజ్ డేట్ పై ట్విస్ట్.!

Published on Mar 1, 2024 1:00 PM IST

యంగ్ హీరో తేజ సజ్జ అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. మరి మన తెలుగు సినిమా నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా ఇది రాగా ఈ చిత్రం ఇప్పుడు 50 రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకోవస్తుంది.

అయితే గత కొన్నాళ్ల నుంచి కూడా హను మాన్ ఓటిటి రిలీజ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇది మార్చ్ లోనే ఉంటుంది అని ముందే కన్ఫర్మ్ అయ్యింది. అయితే మార్చ్ 2న జీ వారు స్ట్రీమింగ్ కి తీసుకొస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

దీనితో ఈ చిత్రం రిలీజ్ డేట్ మార్చ్ 2 నుంచి మార్చ్ 8కి మారింది. దీనితో ఈ డేట్ నుంచి జీ 5 లో హను మాన్ స్ట్రీమింగ్ కి రావడం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యినట్టుగా వార్త. సో ఈ డేట్ వరకు వీక్షకులు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు