సలార్ సినిమాకి షాకింగ్ రన్ టైమ్

సలార్ సినిమాకి షాకింగ్ రన్ టైమ్

Published on Dec 11, 2023 10:00 AM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. అయితే, ఈ సినిమా ఇప్పటికే ‘ఏ’ సర్టిఫికెట్ తో సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా స‌లార్ సినిమా ర‌న్ టైమ్ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. స‌లార్ సినిమా ‘2 గంట‌ల 55 నిమిషాల ర‌న్ టైమ్‌తో రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

ఇక సలార్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్.. ఆద్య అనే పాత్రలో కనిపించనుంది. ఇక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే సరికొత్త మాస లుక్ గా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నిలిచిపోతుందట. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ స్థాయిలో ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశాడట. అందుకే, ఈ సినిమాకి భారీ డిమాండ్ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, టిన్ను ఆనంద్ వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు