ప్రియా.. మహేష్ సరసన నటించట్లేదు !

ప్రియా.. మహేష్ సరసన నటించట్లేదు !

Published on May 3, 2020 12:01 AM IST

Priya Prakash Varrier

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ తో పాటు స్టార్ డమ్ ని సంపాదించింది యంగ్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మెహెష్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ… ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మేము ప్రియా ప్రకాష్ ను అనుకోలేదని స్పష్టం చేసారు. మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదని ఆయన అన్నారు.
.

ఇక చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమాను కూడా మహేష్ లైన్ లో పెట్టారని.. కాకపోతే అది వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా వార్తలు