కన్ఫర్మ్ : బాలయ్య నెక్స్ట్ లో ‘వీరమల్లు’ నటుడు

కన్ఫర్మ్ : బాలయ్య నెక్స్ట్ లో ‘వీరమల్లు’ నటుడు

Published on Nov 28, 2023 10:58 PM IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” థియేటర్స్ రిలీజ్ అనంతరం ఓటిటి లో కూడా వచ్చి గట్టి రెస్పాన్స్ ని అందుకొని దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ అయితే తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్ కూడా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వచ్చాయి.

అయితే ఇది ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాను అంటూ “హరిహర వీరమల్లు” డైలాగ్ చెప్పాడు. అంటే రీసెంట్ గానే బాలయ్య సినిమా కూడా లాక్ అయ్యి ఉండాలి. దీనితో ఈ రెండు సినిమాలు తాను తెలుగు చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక బాలయ్య సినిమాపై మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు