తెలుగులో రూపొందింని సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’(Constable Kanakam) ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయింది. అందాల భామ వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్‌కు కొనసాగింపుగా రీసెంట్‌గా ‘కానిస్టేబుల్ కనకం సీజన్-2’ కూడా వచ్చింది.
ఈ రెండో భాగం సిరీస్ కూడా ప్రేక్షకులను మెప్పించడంతో యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ సాలిడ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘కానిస్టేబుల్ కనకం ఖాల్ ఘాట్ చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే, దీనిని సినిమా లాగా తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వారు ప్రకటించారు.
‘కానిస్టేబుల్ కనకం’ సిరీస్‌లోని యాక్టర్స్ ఈ చిత్రంలోనూ కంటిన్యూ అవుతారని వారు తెలిపారు. దీంతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇక సినిమాగా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.


