‘డియర్ కామ్రేడ్’ నో బ్రేక్ !

‘డియర్ కామ్రేడ్’ నో బ్రేక్ !

Published on Nov 7, 2018 6:30 PM IST

యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డీయర్ కామ్రేడ్ షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఈరోజు దీపావళి అయిన కూడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుని పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇక రష్మీక విజయ్ కలిసి నటించడం ఇది రెండోసారి. ఇంతకుముందు వీరిద్దరు కలిసి నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం ఫై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఇక విజయ్ ఈ నవంబర్ 17న టాక్సీవాలా చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు