పవన్ నుండి వరుస ట్రీట్స్ ఉంటాయి మరి

Published on Mar 2, 2021 7:12 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడింది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుంది. గట్టిగా ఒక్క నెల మాత్రమే ఉండటంతో నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన ‘మగువ మగువ’ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కొద్దిరోజుల క్రితం వచ్చిన టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఆ జోరును కొనసాగిస్తూ ఇంకో రెండు పాటలను రెడీ చేశారు టీమ్.

వాటిలో ‘సత్యమేవ జయతే’ సాంగ్ రేపు 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదలకానుంది. రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇందులో పవన్ మూడు గెటప్లలో కనిపిస్తారని టాక్ కూడ ఉంది. ఇక మూడవ పాటను వచ్చే వారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి ఆఖరి వారంలో ఈ రిలీజ్ ఉండొచ్చు. మధ్యలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న పిరియాడికల్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఎలాగూ ఉండనే ఉంది. సో.. రానున్న నెల రోజులు పవన్ నుండి అభిమానుల కోసం వరుస అప్డేట్లు ఉండబోతున్నాయి. ఇకపోతే పవన్ ప్రెజెంట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, క్రిష్ సినిమాను ఏకకాలంలో చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :