బన్నీ కొత్త సినిమా పేరు ‘రథం’ కాదు..!

బన్నీ కొత్త సినిమా పేరు ‘రథం’ కాదు..!

Published on Apr 29, 2015 10:41 AM IST

Allu-arjn
‘S/O సత్యమూర్తి’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటించే తరువాతి సినిమా కోసం అంతా సిద్ధమైంది. మాస్
యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను బన్నీ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బన్నీ కోసం ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను బోయపాటి సిద్ధం చేశారు. బావోద్వేగ పూరిత సన్నివేశాలతో మనల్ని కట్టిపడేసే బోయపాటి ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశాలతో మెప్పిస్తాడని సమాచారం.

తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘రథం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ‘రథం’ అనే టైటిల్ అల్లు అర్జున్ సినిమాకు పెట్టిన పేరు కాదని దర్శకుడు బోయపాటి స్పష్టం చేశారు. బన్నీ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ టైటిల్ పెట్టామని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాను మే నెల రెండో వారంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘S/O సత్యమూర్తి’ సక్సెస్‌ ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉన్నారు. ఆ తర్వాత వెంటనే బోయపాటి సినిమా కోసం సిద్ధమవనున్నారు.

తాజా వార్తలు