గ్రహణంతో మొదలైన ‘వృషకర్మ’ కౌంట్‌డౌన్.. విజువల్ ట్రీట్‌కు సిద్ధం కావాలంటున్న టీమ్..!

VRUSHAKARMA

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వృషకర్మ’ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

‘ది రైజ్ ఆఫ్ వృషకర్మ’ గ్లింప్స్‌ను మార్చి 5న మధ్యాహ్నం 12.12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. నేడు(ఫిబ్రవరి 3) చంద్రగ్రహణం రావడం కో-ఇన్సిడెన్స్ కాదని.. ఇదొక సిగ్నల్ అంటూ ఈ చిత్ర మేకర్స్ ఈ గ్లింప్స్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ఈ గ్లింప్స్‌తో ‘వృషకర్మ’లో ఎలాంటి విజువల్ ట్రీట్ ఉండబోతుందో శాంపిల్ చూపెట్టబోతున్నారు.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య చేసే అడ్వెంచర్ ప్రేక్షకులను ఖచ్చితంగా కట్టిపడేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ మూవీ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version