ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Couple Friendly Public Talk

యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మరియు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 13, 2026 నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి వస్తుందని సమాచారం. థియేటర్లలో కంటే ఓటీటీలో ఈ తరహా ప్రేమకథలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మరింత మెరుగైన రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. యువీ కాన్సెప్ట్స్ మరియు విఆర్ గ్లోబల్ మీడియా పతాకాలపై అజయ్ కుమార్ రాజు పి నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు.

Exit mobile version