
వరుస హిట్లతో జోరు మీదున్న నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. గౌతమ్ మీనన్ శిష్యుడు ప్రేమ్ సాయి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా కొన్ని ఆర్థిక సమస్యలతో ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరకు ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గౌతమ్ మీనన్ అన్ని ప్లాన్స్ పూర్తి చేశారు.
ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. “కొరియర్ బాయ్ కళ్యాణ్ స్టోరీలైన్ చాలా కొత్తగా ఉంటుంది. నెరేషన్ కూడా ఆసక్తికరంగా నడుస్తుంది. కొత్తదనమున్న సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది” అని తెలిపారు. ఇక తమిళంలో ఈ సినిమాకు జై హీరో కాగా, తెలుగు, తమిళం రెండింట్లోనూ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటించారు.