నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్.?

Courier-Boy-Kalyan
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను కంటిన్యూగా ఎంటర్టైన్ చేసిన హీరో నితిన్. ‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. ఈ గ్యాప్ లో తన హోం ప్రొడక్షన్ లో ఆఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కానుండడంతో నితిన్ తన ఫోకస్ ని షిఫ్ట్ చేసాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కాకుండా చాలా రోజుల క్రితం షూట్ పూర్తైన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసాడు.

అందులో భాగంగానే ఇటీవలే ఘనంగా ఆడియో లాంచ్ కూడా చేసారు. తాజాగా ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఆ తేదీపై కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోయినా ఆ తేదీ ఐతే రిలీజ్ కి పర్ఫెక్ట్ అని ఈ చిత్ర టీం భావిస్తోంది. సో త్వరలోనే ఇదే విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ప్రేమ్ సాయి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సింగర్ కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version