బాలయ్య ‘అఖండ 2’ పై క్రేజీ రూమర్

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో బాలయ్య – విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. పైగా కల్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి నటించి అలరించారు.

మరి ఈ నేపథ్యంలో విజయశాంతి అఖండ 2 లో నటిస్తే.. ఎలా ఉంటుందో చూడాలి.కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. అన్నట్టు మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version