“దేవర” గ్లింప్స్ పై క్రేజీ బజ్.!

“దేవర” గ్లింప్స్ పై క్రేజీ బజ్.!

Published on Nov 29, 2023 11:30 AM IST

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే సినిమా మొదలు కావడం ఆలస్యంగానే స్టార్ట్ అయినప్పటికీ షూటింగ్ మాత్రం అనుకున్నట్టుగా పక్కా ప్లాన్ ప్రకారం కంప్లీట్ అయిపోతుంది. అలాగే అప్డేట్స్ కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మరి వీటి అన్నిటిని మించి “దేవర” గ్లింప్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుండగా ఈ గ్లింప్స్ పై క్రేజీ బజ్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది.

మరి దీని ప్రకారం అయితే మేకర్స్ ఈ కొత్త ఏడాది సందర్భంగా రిలీజ్ చేసే ప్లానింగ్ లలో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో 2024 ఏడాది ఆరంభంతోనే ఏ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ట్రీట్ ని ఆశించవచ్చు. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ వ్యయంతో సినిమా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు