సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసిందే. అయితే, తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన ఒక అప్ డేట్ తెలిసింది. ఈ సాంగ్ లో మహేష్ బాబుతో కలిసి బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కూడా ఆడిపాడనుంది. దుబాయ్ నుండి చిత్ర యూనిట్ తిరిగి వచ్చిన తర్వాత ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
