క్రేజీ బజ్ : “శక్తి మాన్” లో రిషబ్ శెట్టికి పవర్ఫుల్ పాత్ర?

క్రేజీ బజ్ : “శక్తి మాన్” లో రిషబ్ శెట్టికి పవర్ఫుల్ పాత్ర?

Published on Apr 21, 2024 4:13 PM IST

మన ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన జానర్ లో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి. ఇప్పుడిప్పుడే మరిన్ని చిత్రాలు ఈ జానర్ లో వస్తుండగా లేటెస్ట్ గా మన తెలుగు నుంచి “హను మాన్” (Hanu Man Movie) వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యి మరిన్ని చిత్రాలకి స్కోప్ ఇచ్చింది. అయితే బాలీవుడ్ సినిమాలో కూడా కొన్ని సూపర్ హీరో సినిమాలు ఉన్నాయి.

కానీ వీటి అన్నిటి కంటే ముందు ఉన్న అసలు సిసలు సూపర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది “శక్తి మాన్” అని చెప్పాలి. నటుడు ముఖేష్ ఖన్నా ప్రధాన పాత్రలో చేసిన ఈ సీరియల్ ఒక సంచలనం అయితే దీనిని ఇప్పుడు సినిమాగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా కనిపించనున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఉంది.

అయితే ఈ సినిమాలో ఇప్పుడు “కాంతార” (Kantara) నటుడు రిషబ్ శెట్టి పేరు వినిపిస్తుంది. అయితే రిషబ్ శెట్టి శక్తి మాన్ లో పవర్ఫుల్ విలన్ పాత్ర అయినటువంటి తమ్రాజ్ కిల్విష్ గా కనిపించనున్నాడని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వినిపిస్తుంది. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి “కాంతార చాప్టర్ 1” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానిని థానే దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు