క్రేజీ బజ్ : ‘SSMB 29’ అనౌన్స్ డేట్ లాక్ అయిందా ?

క్రేజీ బజ్ : ‘SSMB 29’ అనౌన్స్ డేట్ లాక్ అయిందా ?

Published on Apr 23, 2024 5:32 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ ఈ మూవీ కోసం ఇప్పటికే పూర్తిగా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తుండగా, కీరవాణి సంగీతాన్ని, సాయి మాధవ్ బుర్రా మాటలని అందించనున్నారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అనౌన్స్ మెంట్ డేట్ తాజాగా లాక్ అయినట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని మే 31న లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి రోజున గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే దీని అనౌన్స్ మెంట్ కి సంబంధించి జక్కన్న అండ్ టీమ్ ఒక వీడియోని సిద్ధం చేస్తున్నారని, త్వరలో అన్ని వివరాలు అధికారికంగా తెలుస్తాయని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు