క్రేజీ బజ్ : తలైవర్ 171 లో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ ?

క్రేజీ బజ్ : తలైవర్ 171 లో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ ?

Published on Apr 15, 2024 11:00 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం టీజె జ్ఞానవేల్ తో వెట్టయాన్ మూవీ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ మూవీని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక దీని అనంతరం లోకేష్ కనకరాజ్ తో తన కెరీర్ 171వ మూవీ చేయనున్నారు రజనీకాంత్. ఈ మూవీ యొక్క టైటిల్ ని ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నారు. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ మూవీలో టాలెంటెడ్ నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించనున్నారనేది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. కాగా ఈ మూవీ రజినీకాంత్ మాస్ స్టైల్, లోకేష్ మార్క్ యాక్షన్ తో సాగే ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు