క్రేజీ బజ్ : ‘టిల్లు క్యూబ్’ ని తెరకెక్కించనున్న ఆ యంగ్ డైరెక్టర్ ?

క్రేజీ బజ్ : ‘టిల్లు క్యూబ్’ ని తెరకెక్కించనున్న ఆ యంగ్ డైరెక్టర్ ?

Published on Apr 22, 2024 9:04 PM IST

టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఇటీవల మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి.

ఇక త్వరలో ఆ మూవీకి సీక్వెల్ గా టిల్లు క్యూబ్ ని నిర్మించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం దీనిని యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించనున్నారని అంటున్నారు. ఇటీవల కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు కళ్యాణ్ శంకర్. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు