క్రేజీ బజ్ : బాలకృష్ణ తో ఆ యంగ్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ ?

క్రేజీ బజ్ : బాలకృష్ణ తో ఆ యంగ్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ ?

Published on Feb 20, 2024 12:23 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ప్రస్తుతం NBK 109 మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోండగా దీనిని రానున్న దసరా బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక మరోవైపు బోయపాటి శ్రీను తో అఖండ 2 మూవీ కూడా బాలకృష్ణ అతి త్వరలో చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ స్టోరీకి బాలకృష్ణ పచ్చజండా ఒప్పారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. దాని ప్రకారం ఇటీవల నానితో శ్యామ సింగ రాయ్ వంటి సక్సెస్ఫుల్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ మూవీ చేయనున్నారని, ఒక బడా నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ ప్రాజక్ట్ గురించి అతి త్వరలో అఫీషియల్ న్యూస్ అనౌన్స్ కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు