క్రేజీ బజ్ : యంగ్ టైగర్ తో త్రివిక్రమ్ మూవీ ?

క్రేజీ బజ్ : యంగ్ టైగర్ తో త్రివిక్రమ్ మూవీ ?

Published on Jan 25, 2024 8:33 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర చేస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీని అనంతరం హృతిక్ రోషన్ తో వార్ 2, అలానే ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ కూడా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. విషయం ఏమిటంటే, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తీసిన త్రివిక్రమ్, దాని అనంతరం తన నెక్స్ట్ మూవీ కోసం సంసిద్ధం అవుతున్నారు.

నిజానికి ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక మూవీ కమిట్ అయ్యారు త్రివిక్రమ్. అయితే తాజాగా టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం త్రివిక్రమ్ తన ఇమీడియట్ ప్రాజక్ట్ ని ఎన్టీఆర్ తో చేయనున్నారని అంటున్నారు. ఓవైపు ఆయన లిస్ట్ లో నాని, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని కూడా టాక్. అయితే రెండేళ్ల క్రితం ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబో మూవీ అనౌన్స్ అయి ఆగిపోవడంతో దానిని త్రివిక్రమ్ ప్రస్తుతం లైన్ లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్ తో చేస్తారా లేదా మరో నటుడితో చేస్తారా అనే దాని పై అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు