మరో అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ లో క్రేజీ కమెడియన్ !

మరో అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ లో క్రేజీ కమెడియన్ !

Published on Apr 11, 2021 7:01 PM IST

టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ అంటేనే మంచి టైమింగ్ ఉన్న కమెడియన్. కాగా గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న ‘సిటీమార్’ సినిమాలో వెన్నెల కిశోర్ కి అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ పడిందట. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ తమన్నా అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట.

ఆ పాత్రలోనే వెన్నెల కిశోర్ నటిస్తున్నాడట. మరి వెన్నెల కిశోర్ ఈ చిత్రంతో ఎలాంటి నవ్వులు పూయిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో సినిమా చేశాడట సంపత్ నంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు