‘కుమారి 21 ఎఫ్’కు క్రేజీ బిజినెస్ ఆఫర్స్!

‘కుమారి 21 ఎఫ్’కు క్రేజీ బిజినెస్ ఆఫర్స్!

Published on Nov 6, 2015 1:51 PM IST

kumari-21-f
‘కుమారి 21 ఎఫ్’.. గత కొద్దికాలం వరకూ ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ సినిమాగా మారిపోయింది. విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల ప్రమోషన్‌తో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌‌లతో ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కుర్రకారును బాగా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ యూత్ ఆలోచనలకు, ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండడంతో వారిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇక ఈ నేపథ్యంలోనే కుమారి 21 ఎఫ్ సినిమా బిజినెస్ పరంగానూ పలు క్రేజీ ఆఫర్స్‌తో మరోసారి ఆసక్తికరంగా మారింది. నైజాం ఏరియాకు సంబంధించి ‘కుమారి 21 ఎఫ్’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. దిల్‌రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను విడుదల చేయనుండడం సినిమాకు బిజినెస్ పరంగా పెద్ద బూస్ట్ అనే చెప్పొచ్చు. ఇక సీడెడ్ ఏరియాలోనూ ఈ సినిమాకు ఇదే స్థాయి ఆఫర్ వచ్చింది.

ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ‘కుమారి 21 ఎఫ్’ సీడెడ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ బిజినెస్ భారీగా జరగడం సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచిందనే చెప్పాలి. రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు