క్రేజీ : నార్త్ మార్కెట్ లో టాలీవుడ్ మూవీస్ డామినేషన్

క్రేజీ : నార్త్ మార్కెట్ లో టాలీవుడ్ మూవీస్ డామినేషన్

Published on Apr 19, 2024 1:02 AM IST

ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు పాన్ ఇండియన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాల మొదలుకొని ఈ ఏడాది రిలీజ్ అయిన హను మాన్ వరకు అన్ని సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లో సైతం బాగానే కలెక్షన్ రాబట్టాయి.

ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన కల్కి 2898 ఏడి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర పార్ట్ 1 మూవీస్ యొక్క నార్త్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ భారీ ధరకు దక్కించుకున్నారు. మొత్తంగా ఇవన్నీ కలిపి రూ. 425 కోట్ల మేర అక్కడ బిజినెస్ జరుపుకున్నాయి.

దీనిని బట్టి ఈ మూవీస్ అన్ని కూడా నార్త్ మార్కెట్ లో గట్టిగానే డామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల యానిమల్ మినహా రిలీజ్ అయిన పలు హిందీ సినిమాలు ఏవి కూడా భారీ విజయాలు అందువుకోలేదనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మన ఈ టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీస్ అన్ని కూడా ఏ స్థాయి సక్సెస్ సక్సెస్ ని కలెక్షన్ ని సొంతం చేసుకుని అక్కడి ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు