మహేష్ మూవీపై మరో క్రేజీ గాసిప్..!

Published on May 30, 2020 7:25 am IST

మహేష్ మూవీ ప్రకటనకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. రేపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ కొత్త మూవీ ప్రకటన ఉంటుందని అందరూ భావిస్తుండగా, ఇంత వరకు దానిపై ఎటువంటి ప్రకటన కానీ, ఖచ్చితంగా ఉంటుందన్న హింట్ కానీ లేదు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం అనేక ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. కాగా మహేష్ మూవీపై వరుస గాసిప్స్ పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వాటిలో నిజం ఎంతో తెలియదు కాని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి.

మహేష్ పరుశురాంతో చేస్తున్న మూవీ టైటిల్ సర్కార్ వారి పాట అని గత కొద్దిరోజులుగా ప్రచారం అవుతుండగా, ఈ మూవీలో మహేష్ ది త్రిఫుల్ రోల్ అని కూడా ప్రచారం జరుగుతుంది. మూడు భిన్న నేపధ్యాలు, వయసులలో మహేష్ పాత్రలు ఉంటాయని సదరు వార్తల సమాచారం. ఇదే కనుక నిజం అయితే, మహేష్ చేస్తున్న మొదటి ట్రిపుల్ రోల్ చిత్రం అవుతుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా డ్యూయల్ రోల్ చేసిన మహేష్, హీరోగా మారాక డ్యూయల్ రోల్ కూడా చేయలేదు.

సంబంధిత సమాచారం :

More