క్రేజీ : త్రివిక్రమ్ ఫ్యాన్స్ అంటూ థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Thaman 1

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా కెరీర్ పరంగా దర్శకుడిగా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లని అలానే ఆడియన్స్ ని బాగా క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తొలిసారిగా తరుణ్, శ్రియ ల కలయికలో తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పాతిన త్రివిక్రమ్, అక్కడి నుండి మొన్నటి అలవైకుంఠపురములో వరకు పలు సక్సెస్ లు, అలానే ఫెయిల్యూర్స్ చూసారు.

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు త్రివిక్రమ్. విషయం ఏమిటంటే, నేడు ఉదయం నుండి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో త్రివిక్రమ్ పై ఒకింత ట్రెండింగ్ స్పేస్ లు జరిగాయి. అందులో కొందరు ఆయనకు అనుకూలంగా మరికొందరు ప్రతికూలంగా మాట్లాడారు. అయితే అవి ఒక్కసారిగా ట్రెండ్ అవడంతో పలు మీడియా మాధ్యమాల్లో సైతం ఆ టాపిక్ పై వార్తలు వచ్చాయి.

ఇక కొద్దిసేపటి క్రితం త్రివిక్రమ్ ఫ్యాన్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ హార్ట్ హ్యాండ్స్, రైజ్ చేసిన హ్యాండ్ ఎమోజీలని పోస్ట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ ఉదయం ట్విట్ట్టర్ లో జరిగిన స్పేస్ ట్రెండ్ కి సపోర్ట్ చేస్తూ వేసిందే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ట్వీట్ ద్వారా మరొక్కసారి గురూజీ త్రివిక్రమ్ పై తనకున్న ప్రేమను చాటుకున్నారు థమన్. ప్రస్తుతం ఆయన ట్వీట్ అయితే వైరల్ అవుతోంది.

Exit mobile version