మాస్ కా దాస్ కోసం మాస్ గాడ్ బాలయ్య ఆగమనం..

మాస్ కా దాస్ కోసం మాస్ గాడ్ బాలయ్య ఆగమనం..

Published on May 26, 2024 10:03 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ సినిమా (NBK 109) చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య ఈ సినిమా షూట్ ని ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉండగా ఈ షూట్ గ్యాప్ లో బాలయ్య కాజల్ సత్యభామ కోసం ఛీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అయితే ఈసారి మాత్రం టాలీవుడ్ మాస్ అండ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కోసం వెళ్ళబోతున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”(Gangs Of Godavari) . ట్రైలర్ తో అదరగొట్టిన ఈ సినిమాకి మేకర్స్ ఈ 28న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫిక్స్ చేయగా ఈ ఈవెంట్ ని గ్రేస్ చేసేందుకు మాస్ గాడ్ నందమూరి బాలయ్య రాబోతున్నట్టుగా ట్రైలర్ లాంచ్ లోనే విశ్వక్ రివీల్ చేసాడు.

దీనితో ఈ క్రేజీ మాస్ కాంబో ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది అలాగే ఆయేషా ఖాన్ (Aayesha Khan) స్పెషల్ సాంగ్ చేయగా ఈ సినిమాని నిర్మాణం వహించిన సితార ఎంటర్టైన్మెంట్స్ వారే బాలయ్య 109 ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు