‘అఖండ’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట

‘అఖండ’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట

Published on Jun 16, 2024 9:30 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖండ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారట. అఖండ సినిమా డిసెంబర్ లో రిలీజై అద్భుత విజయాన్ని అందుకుంది. అఖండ సెంటిమెంట్ తోనే NBK 109వ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులు కూడా కలిసొస్తాయి. కాబట్టి, డిసెంబర్ లోనే తన సినిమాని రిలీజ్ చేయాలని బాలయ్య కూడా ఆసక్తిగా ఉన్నాడట.

ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు