ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ కి సన్నద్ధం

ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ కి సన్నద్ధం

Published on Mar 25, 2024 8:00 AM IST

War 2

ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఐతే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. లాస్ట్ షెడ్యూల్ లో హృతిక్ రోష‌న్‌ పై కొన్ని కీలక సాన్నివేశాలు తీశారు. కాగా ఈ సారి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ను తీయాలని ప్లాన్ చేశారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుందని టాక్.

ఇక ‘వార్ 2’ కంటెంట్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఇది ఇద్దరి స్నేహితుల కథ అని, అర్జునుడు – కృష్ణుడు లా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు.. చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఏది ఏమైనా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు