ప్రభాస్ ‘కల్కి..’ పై క్రేజీ రూమర్

ప్రభాస్ ‘కల్కి..’ పై క్రేజీ రూమర్

Published on Dec 5, 2023 3:02 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని.. ప్రభాస్ క్యారెక్టర్ లోని సాలిడ్ వేరియేషన్ కూడా ఈ సీక్వెన్స్ లోనే రివీల్ అవుతుందని.. అందుకే, మొత్తం సినిమాలో ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్నట్టు మే 9న క‌ల్కి సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు